telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూక‌దాడులపై స్వరభాస్కర్ సంచలన వ్యాఖ్యలు

Swara-Bhaskar

మ‌న దేశంలో దళితులు, ముస్లింలు, ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్ర‌ముఖ న‌టి స్వ‌ర‌భాస్క‌ర్ నోరు విప్పారు. మూక‌దాడులు అంటు వ్యాధిలా మారాయని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఈ వివాదం మ‌రింత ముద‌ర‌క‌ముందే ప్ర‌ధాని దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మూకదాడులను వెంటనే నిరోధించాలంటూ సినీ ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ కూడా రాశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 49 మంది ప్రముఖులు దీనిపై త‌మ వాద‌న‌ని వినిపించ‌గా ఇందులో ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్, అపర్ణాసేన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, గాయకురాలు శుభ ముద్గల్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, నటీమణులు రేవతి, కొంకణాసేన్ తదితరులు ఉన్నారు. జై శ్రీరాం అనే పేరును ఇతరులను రెచ్చగొట్టేలా ఓ రణ నినాదంగా మార్చడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అసమ్మతి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై జాతి వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్ వంటి ముద్ర వేయడం సరికాదు అని స్ప‌ష్టం చేశారు. అయితే మూకదాడులపై సినీప్రముఖులు లేఖను కేంద్ర హోమ్ ఖండించింది.

Related posts