telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

154 స్థానాల్లో కమల్ పార్టీ పోటీ…

Kamal-Haasan

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పొత్తులు, పోటీలపై తమిళనాడు రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి… ఈ ఎన్నికల్లో ఇప్పటికే డీఎంకే-కాంగ్రెస్‌, అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల సరద్దుబాటు పూర్తి కావొస్తుండగా.. ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమయ్యారు సినీ నటుడు కమల్ హాసన్.. తనతో కలిసి వస్తున్న పార్టీలతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయన.. మొత్తం అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపాలనే నిర్ణయానికి వచ్చారు.. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. వాటిలో 154 స్థానాల్లో మక్కల్‌ నీది మయ్యం అభ్యర్థులు బరిలో ఉంటారని.. తమ కూటమిలోని ఆలిండియా సమతువ మక్కల్‌ కచ్చి, ఇందియా జననాయగ కచ్చి.. 40 స్థానాల చొప్పున మొత్తం 80 స్థానాల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. ఇక, ఈ ఎన్నికల్లో తమ విధానాలను, ఆలోచనలను డీఎంకే కాపీ కొట్టిందని విమర్శిస్తున్నారు కమల్ హాసన్.. తాము అధికారంలోకి వస్తే 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని.. రేషన్ కార్డులు ఉన్న మహిళలకు రూ.వేయి చొప్పున సాయం చేస్తామని తెలిపామని కమల్ హాసన్ అన్నారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ప్రజలు ఏ విధమైన తీర్పును వెల్లడిస్తారు అనేది. 

Related posts