telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నేడే బతుకమ్మ పండుగ…వీడియో సందేశంతో శుభాకాంక్షలు చెప్పిన కవిత

kavitha trs

తెలంగాణ ఆడ పడుచులు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసింది ఎమ్మెల్సి కవిత. ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూ ట్యూబ్ లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నామని తెలిపారు. ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్ లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని…మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని పేర్కొన్నారు. వరదల‌ కారణంగా నష్టపోయిన వారందరినీ అందుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకమని తెలిపారు. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా కల్వకుంట్ల కవిత అన్నారు.

Related posts