telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

AP total voters 3.69 crores EC delcared

తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, అధేవిదంగా కరీంనగర్ -మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌బీ వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలింగ్‌ ప్రారంభమైంది.

పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోని కేంద్రాల్లో 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. అధికారులు ప్రతి వెయ్యిమంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 472 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

Related posts