telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఫలితాలు

5 states vote counting in india

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఏపీ, తెలంగాణలో కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.

ఏపీలో ఒక టీచర్‌, రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇవాళ మధ్యాహ్నం లోపు ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Related posts