telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డకు రోజా కౌంటర్…

roja ycp mla

ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఏకగ్రీవాల రగడ నడుస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు గాను 110 ఏకగ్రీవాలు నమోదు కావడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని కమీషన్ స్పష్టం చేయడంతో అధికార పార్టీ నేతలకు షాక్ తగిలినట్టు అయింది. అయితే ఎన్నికల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏకగ్రీవాలు జరిగాయని వాటిని తప్పుపడటం ఎంటని కౌంటర్ ఇస్తున్నారు వైకాపా నేతలు. తాజాగా ఈ అంశం మీద స్పందించిన రోజా నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తే చిన్న మెదడు చితికిపోయినట్లు అనుమానం వస్తోందని అన్నారు. గతంలో జరిగినా వాటికి ఎలా పోల్చి చిత్తూరు, గుంటూరు ఎస్పీ,కలెక్టర్ మార్చి ఎన్నికల నిర్వహించారని, ఇప్పటికీ ఏకగ్రీవాలు అయితే పునః పరిశీలన చేయాని చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. నిమ్మగడ్డకు ఆయనపైనే నమ్మకం లేకుండా పోయిందా…?? అని రోజా ప్రశ్నించారు. నీకు నచ్చిన వారినే కధ తెచ్చిపెట్టుకున్నావు‌‌, చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ ఎలా పనిచేస్తున్నాడని చెప్పడానికి ఇదోక ఉదాహరణ అని ఆమె అన్నారు. ప్రజలు చేసుకున్న ఏకగ్రీవాలను గౌరవించండి …హాస్యాస్పదం చేయకండి అని ఆమె కోరారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మాట్లాడుతూ నిమ్మగడ్డుకు ఎమైనా మతిమరుపు వచ్చిందా ? అని ప్రశ్నించారు.

Related posts