telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడం తప్పే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో తాను టీఆర్ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం  తప్పేనని  జగ్గారెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్యేలది కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బుల కోసమే టీఆర్ఎస్‌‌లో చేరుతున్నారనే విషయం పై ఆయన స్పందించారు.

డబ్బులు తీసుకొని పార్టీలు మారడాన్ని ఆయన తప్పుబట్టారు.జగ్గారెడ్డిని ఎవరూ కొనలేరని, తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు నాయకత్వ వైఫల్యం ఏమాత్రం కారణం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts