telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ మార్పుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy gives clarity party change

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార టీఆఎస్ పార్టీలోకి భారీగా వలసలు ఊపందుకొన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నుండి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను పార్టీ మారే విషయం కాలమే నిర్ణయిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతవరకు ఎలాంటి ప్రచారాలను నమ్మవద్దని జగ్గారెడ్డి సూచించారు.

తన పోరాటం టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై కాదని, గతంలో తమ జిల్లాకు అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావుపైనే అని వెల్లడించారు. ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయిన సంగారెడ్డి ప్రజల పక్షాన తాను మాట్లాడుతున్నానని అన్నారు. ప్రస్తుతం వేసవి సందర్భంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని, దీనికి హరీషే కారణమని జగ్గారెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగాణే వుందని, ఎమ్మెల్యేలు ఎవ్వరు తమంతట తాముగా పార్టీ మారాలని అనుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలతోనే వారు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

Related posts