telugu navyamedia
రాజకీయ వార్తలు

చిదంబరం అరెస్ట్ ను ఖండించిన స్టాలిన్

stalin going to attend to jagan oath program

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య చిదంబరం ను అరెస్ట్ చేయడంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

సీబీఐ అధికారులు గోడ దూకి చిదంబరం నివాసంలోకి వెళ్లడాన్ని తాను కూడా చూశానని తెలిపారు. ఇలా వ్యవహరించడం దేశానికే సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం విజ్ఞప్తి చేసినా ఆయనను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు భారీబందోబస్తు మధ్య కొద్దిసేపటి క్రితమే సీబీఐ ప్రత్యేక కోర్టుకు తరలించారు.

Related posts