telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మిథాలీ రాజ్.. అరుదైన ఘనత..

women cricket team got series

భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత అందుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఉమెన్స్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగిన క్రీడాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 200వ వన్డే ఆడిన మిథాలీ.. చిరస్మరణీయ గేమ్‌లో 28 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది.

ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 36ఏండ్ల మిథాలీ వన్డేల్లో 51.33 సగటుతో 6622 పరుగులు సాధించి అత్యధిక రన్స్‌ చేసిన మహిళా క్రికెటర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. అందులో 7 శతకాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మిథాలీ సహచర క్రికెటర్ల సమక్షంలో కేక్‌ కూడా కట్‌ చేసింది. 1999లో వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మిథాలీ 263 వన్డేలు ఆడింది. ఇప్పటి వరకు 10 టెస్టులు.. 85 టీ20లు ఆడింది.


భారత మాజీ క్రికెటర్లు అద్భుత రికార్డు సాధించిన మిథాలీరాజ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

Related posts