telugu navyamedia
telugu cinema news

భారీ రేటుకు “మిస్టర్ మజ్ను” శాటిలైట్ రైట్స్

Mr.Majnu

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో “మిస్టర్ మజ్ను” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. అయితే ఇప్పుడే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైపోయింది. ఇక శాటిలైట్ రైట్స్ కోసం కొన్ని సంస్థలు భారీ స్థాయిలో పోటీ పడగా… మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానల్ వారు దక్కించుకున్నారు. ఈ ఛానెల్ వారు “మిస్టర్ మజ్ను” సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కోసం 5 కోట్లు చెల్లించారని సమాచారం. గతంలో అఖిల్ నటించిన “అఖిల్, హలో” సినిమాల శాటిలైట్ రైట్స్ ను కూడా ఇదే సంస్థ సొంతం చేసుకోవడం గమనార్హం. థమన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకార్షణగా నిలవనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

Related posts

“మ‌హా”.చిత్రం లో డిఫ‌రెంట్ లుక్స్ తో.. హాన్సిక

ashok

వెన్నెల్లో ఆడపిల్ల…

vimala p

ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న సీనియర్ నటుడు

vimala p