telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఇంటి దూలాలుగా, కాలువను దాటే బ్రిడ్జీలుగా .. మిస్సైల్స్ , అక్కడ అంతేనట.. !!

missiles used as roofs and bridges

ఒక్కో ప్రాంతం ఒక్కో దానికి ప్రాముఖ్యతను పొందుతుంది. అది తినుబండారం అయిఉండవచ్చు లేదా ఉత్పత్తి అవొచ్చు. అలాంటి ప్రాముఖ్యతను పొందిన ఒక ఊరు గురించి ఇప్పుడు చూద్దాం. అది చిన్న ఊరే, దానిలో ఏముంటుంది అనుకోవచ్చు. ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉంది. అసలు విషయం ఏమంటే, ఆ గ్రామంలో మిసైళ్లను ఇంటి పైకప్పు దూలాలుగా, కాలువలు దాటేందుకు బ్రిడ్జి లుగా వాడేస్తున్నారు. అలా తరాలుగా వాడేస్తున్నారట. మరి పేలలేదా అంటే, ఇంతవరకు ఏమి జరగలేదు. సాధారణంగా కొంతమందికి కొత్త ప్రాంతాలు వెళ్లడం అలవాటు. అలాగే ఒక వ్యక్తి ఆ ఊరికే వెళ్ళాడట, అక్కడ మిస్సైల్స్ వాడకం చూసి భయపడిపోయి, ప్రభుత్వానికి తెలియజేశాడట. అంతవరకు ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలిసినట్టు లేదు.

మొత్తానికి ఆ వ్యక్తి చొరవతో, బాంబ్ స్క్వాడ్ వచ్చి ఆ మిసైల్ లను పరిశీలించారు. అవి ఎప్పుడైనా పేలవచ్చని.. త్వరగా నిర్వీర్యం చేయాలనీ నివేదిక ఇచ్చారట. ఇంత జరుగుతున్నా అక్కడి ప్రజలు, భయపడటం లాంటివి ఏమి చేయకపోవడం విశేషం.

ఆ ఊరు చిన్నదే అయినా, మిస్సైల్స్ మాత్రం 400 ఉన్నాయట. అప్పుడెప్పుడో యుద్ధంలో మిగిలిన వాటిని వదిలేస్తే, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాటిని పైన చెప్పినట్టుగా వాడేసుకున్నారు. అవి అసలు మిస్సైల్స్ అనికాని, అవి ప్రమాదం అని కానీ వారికీ తెలియకపోవటం అందరిని ఆశ్చర్యపరిచింది.

వీటి తీవ్రతను డీమైనింగ్ టీమ్ గ్రామంలోని మహిళలకు వివరించింది. దీనితో మహిళలు స్పందిస్తూ..‘ఈ క్షిపణులు మా వంట గదుల పక్కనే ఉన్నాయి. వీటిని వెంటనే తీసేయండి’ అని అధికారులను కోరుతున్నారు. అయితే వీటిని తొలగించడం అంత సులభం కాదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే క్షిపణులను తొలగించేటప్పుడు ఏమాత్రం ఒత్తిడి, రాపిడికి గురైనా అవి ఒక్కసారిగా పేలిపోతాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మిస్సైల్ గ్రామం, అఫ్గానిస్తాన్ లోని కెజెలాబాద్.

Related posts