telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

మిస్ యూనివర్స్ వేడుకలు… వేదికపై జారి పడ్డ సుందరీమణులు… వీడియో వైరల్

Miss-Universe

మిస్ యూనివర్శ్ – 2019 కిరీటాన్ని సౌత్ ఆఫ్రికాకు చెందిన జొజిబినా టుంజీ దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలో ఆదివారం రాత్రి ఈ పోటీలను నిర్వహించగా.. ఈ పోటీలలో 90 మంది భామలు పాల్గొన్నారు. అయితే ఈ పోటీలలో పాల్గొన్న ఫ్రాన్స్, మలేషియాలకు చెందిన భామలకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఇద్దరు భామలు స్విమ్ సూట్ రౌండ్‌లో స్టేజ్‌పై ర్యాంప్‌ వాక్ చేసే సమయంలో.. కాలు స్లిప్ అవడంతో ఒక్కసారిగా జారి పడ్డారు. దీంతో అక్కడున్న జడ్జిలు, మిగతా కంటెస్టెంట్‌లు షాకయ్యారు. అయితే ఇద్దరిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మిస్ ఫ్రాన్స్ 2018 మేవా కౌక్ స్పందిస్తూ.. తాను కింద పడిపోయిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. గత రాత్రి తాను స్టేజి మీద పడిపోయానని.. అయితే ఈ ఘటన ద్వారా తాను ఓ విషయం తెలుసుకున్నానన్నారు. ఒక స్త్రీ తన జీవితంలో కింద పడటం, పైకి లేవడం సహజమని.. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకెళ్తూనే ఉండాలనేది తాను నేర్చుకున్న పాఠమని తెలిపారు. కాగా, వీరితో పాటు మిస్ మాల్టా, మిస్ ఇండోనేషియా కూడా స్టేజిపై స్లిప్ అయినట్టు వార్తలొస్తున్నాయి.

Video Source: Phoy Diaz

Related posts