telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ యువతి చనిపోయిన 117 రోజులకి బిడ్డకు జన్మనిచ్చిందట..!

baby

బ్రెయిన్‌డెడ్ అయిన ఓ గర్భవతి 117 రోజులపాటు చికిత్స పొంది పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. యూరోప్ ఖండంలోని జెఖియా దేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ నెలలో 27 ఏళ్ల యువతికి సడన్ స్ట్రోక్ రావడం, బ్రెయిన్ హెమొరేజ్ కావడంతో ఆమెను ఎయిర్ ఆంబులెన్స్(హెలికాప్టర్) ద్వారా ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లారు. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు స్పష్టం చేశారు. యువతి గర్భంతో ఉండటంతో ఆమె కుటుంబసభ్యులకు ఏం చేయాలో తోచలేదు. ఎలానైనా కడుపులో బిడ్డను కాపాడమంటూ కుటుంబసభ్యులు డాక్టర్లను వేడుకోవడంతో.. ఆమెకు చికిత్స అందిస్తూనే డాక్టర్లు వచ్చారు. లోపలి బిడ్డ ఆరోగ్యం, గ్రోత్ కోసం యువతి కాళ్లను ఊపుతూ ఉండేవారు. అలా 117 రోజులు అలానే ఆసుపత్రి బెడ్‌పై పడి వున్న యువతి ఆగస్టు 15వ తేదీన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. సిజేరియన్ ద్వారా డాక్టర్లకు బిడ్డకు ప్రాణం పోశారు. 4.7 పౌండ్ల బరువుతో, 16.5 ఇంచులతో బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. బ్రెయిన్‌డెడ్ అయిన యువతికి శాశ్వతంగా విముక్తి కలిగించాలని ఆమె కుటుంబసభ్యల అంగీకారంతో డాక్టర్లు ఆమె లైఫ్ సపోర్ట్‌ను తీసేశారు. కాగా, జన్మించిన బిడ్డ యువతి భర్త దగ్గరే ఉంటోంది.

Related posts