telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

స్కూల్ పరిధిలోనే స్టూడెంట్ పై ఆత్యాచారం…

rape

మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు మన దేశంలో భారీగా పెరిగి పోతున్నాయి. చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నా నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.  దేశంలో సగటున రోజుకు 87 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.2018 కంటే నేరాల సంఖ్య 2019 లో పెరిగినట్టు నేషనల్ డేటా చెప్తున్నది.  2020లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. తాజాగా చిత్తూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు మామూలుగా స్కూల్స్ జరగడం లేదు. కానీ తల్లితండ్రులు ప్రత్యేక అనుమతి ఇస్తే పిల్లల్ని స్కూల్స్ కి అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యేక తరగతుల కోసం వెళ్లిన ఓ విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు రేప్ అటెంప్ట్ చేశాడు. ఉదయం ఇంటి నుంచి స్కూలుకు వెళ్లిన అబాలిక  మధ్యాహ్నం అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను వెతుక్కుంటూ పాఠశాలకు వెళ్లారు. ఆ సమయంలో స్కూల్ లో ఎవరూ లేకపోవడంతో బాలుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడుతూ కనిపించాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఆ బాలున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించి ఇచ్చారు. బాలుడు మైనర్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి జువైనల్ హోమ్ కి పంపించారు. 

Related posts