telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేస్తే సస్పెండ్‌ చేస్తారా : యనమల

Minister Yanamala comments Ys Jagan

ప్రధాని మోదీ పై తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని అయినా, సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానులేనని, ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిని ఎలా సస్పెండ్‌ చేస్తారని ఆయన ప్రశ్నించారు.

మోదీ అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని తె న్యాయవ్యవస్థనూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగపర విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని యనమల అన్నారు. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లు సోదాలు చేస్తే చర్యలేవి? అని యనమల నిలదీశారు. కేబినెట్‌ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్‌కు లేదన్నారు. అప్పులు, వడ్డీరేట్లపై సీఎస్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని యనమల పేర్కొన్నారు.

Related posts