telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది: యనమల

Minister Yanamala comments Ys Jagan

ఓటు హక్కు పై ప్రజలకు అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని టీడీపీ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశామో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని తెలిపారు. 50 శాతం వీవీప్యాట్ యంత్రాలను లెక్కించడానికి వారం రోజులు పడుతుందని ఈసీ చెప్పడం సరికాదన్నారు. టీడీపీ పోరాటం చేయడంతోనే ఈసీ వీవీప్యాట్ యంత్రాలను తీసుకొచ్చిందని చెప్పారు. ఈవీఎంల పనితీరుపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు ఉన్నాయనీ పేర్కొన్నారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈవీఎంల విషయమై పోరాటాలు చేశామని పేర్కొన్నారు. కేవలం 2 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కిస్తామని ఈసీ చెప్పడం సరికాదన్నారు. దేశంలో బీజేపీ మినహా మిగిలిన 22 పార్టీలన్నీ 50 శాతం వీవీప్యాట్ యంత్రాలను లెక్కించాలని కోరుతున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈవీఎంలను ప్రవేశపెట్టి వెనక్కి తీసుకున్నాయని యనమల గుర్తుచేశారు.

Related posts