telugu navyamedia
Uncategorized తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నో విషయాల్లో కోడెల మాకు మార్గదర్శకుడు: తలసాని

talasani srinivasayadav on clp merger

ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతి పట్ల తెలంగాణ మనత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారాన్ని వ్యక్తం చేశారు. కోడెల ఈ విధంగా మరణించడం తనకు చాలా బాధను కలిగిస్తోందని ఒకప్పటి ఆయన సహచరుడు తలసాని వ్యాఖ్యానించారు. కోడెల ఓ గొప్ప నాయకుడని అన్నారు. తామంతా ఒకే పార్టీలో ఉన్న వేళ, ఎన్నో విషయాల్లో ఆయన తమకు మార్గదర్శకుడిగా ఉన్నారని చెప్పారు.

ఏ కార్యక్రమం చేసినా, ప్రజల గురించి ఆలోచిస్తుండేవారని భావోద్వేగంతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారుండరని అన్నారు. ఓ డాక్టర్ గా, రాజకీయ నేతగా కోడెలకు అపారమైన అనుభవం ఉందని తెలిపారు. పేదలకు వైద్యం అందిస్తూ, రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మరణం ప్రజలకు తీరని లోటని అన్నారు.

Related posts