• Home
  • వార్తలు
  • కుమారస్వామి సేనలో …లెక్క తప్పింది..మంత్రి రాజీనామా..
రాజకీయ వార్తలు వార్తలు

కుమారస్వామి సేనలో …లెక్క తప్పింది..మంత్రి రాజీనామా..

minister resign in kumaraswami team

కర్ణాటకలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి అనేక ఇబ్బందులు ఈ ఇరు పార్టీల మధ్య ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనసాగుతూనే ఉంది. కాగా తాజాగా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన బీఎస్.పి నేత రాజీనామా చేయటం జరిగింది. ఆ పార్టీ నుండి ఎన్ మహేష్ ఎమ్మెల్యేగా ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కానీ గురువారం రాజీనామా మహేష్ తనపదవికి రాజీనామా చేశారు.

రాజీనామా చేసిన అనంతరం మహేష్ మాట్లాడుతూ, తన సొంత నియోజక వర్గం కొల్లెగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అలాగే వచ్చే ఎన్నికల కోసం పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజీనామా సమర్పించినట్టు చెప్పారు. పార్టీ మద్దతు ప్రభుత్వానికి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తాను ఎప్పుడు బెంగుళూరు లోనే ఉంటూ సొంత నియోజక వర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. అందుకే అటు పార్టీని, ఇటు తన నియోజక వర్గ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజీనామా చేసినట్టు చెప్పారు.

Related posts

రైతులకు సాయం కేసీఆర్ జిమ్మిక్కులు : ఉత్తమ్

admin

తొమ్మిది రోజుల పాటు తిరుమలలో సామాన్యులకు గదులు నిల్!

jithu j

సందర్శనార్ధం రాష్ట్రపతి భవన్..

admin

Leave a Comment