telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డపై పేర్ని నాని ఆగ్రహం…

నిమ్మగడ్డ పదవికాలం ముగిసినా.. ఆయనపై విమర్శలు ఆగడంలేదు.. దానికి కారణం.. ఆయన గవర్నర్‌కు లేఖ రాయడమే.. నిమ్మగడ్డపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. శ్రీరంగ నీతుల లేఖ ఒకదాన్ని విడుదల చేశారని.. ఓ పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్లు ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  పారదర్శకంగా ఎన్నికల నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. గవర్నర్ కు లేఖ రాయటం విచిత్రంగా ఉందన్న మంద్రి పేర్నినాని.. బరితెగింపు… నిర్లజ్జ వ్యవహార శైలి నిమ్మగడ్డది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో హోటల్‌లో రహస్యంగా మంతనాలు జరిపిన నిమ్మగడ్డ.. ఎస్ఈసీ రాజకీయ నాయకులతో దూరంగా ఉండాలని సూచన ఇవ్వటం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు.. అడుగడుగునా చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేసి… ఉద్యోగం అయిన తర్వాత లేఖ రాయటం చూస్తే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించిన మంత్రి పేర్నినాని.. టీడీపీ ఆఫీసులో తయారైన లేఖపై సంతకం పెట్టి కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి నిమ్మగడ్డ అంటూ ఫైర్ అయ్యారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఫార్మ్ 6 ప్రకారం అర్హత లేకుండా ఓటు కావాలని కోర్టుకు ఎక్కి వ్యక్తి నిమ్మగడ్డ అని.. టీడీపీకి ఓటు వేయలేకపోయానన్న ఆవేదన నిమ్మగడ్డది అంటూ కామెంట్ చేశారు.

Related posts