• Home
  • వార్తలు
  • కేసీఆర్ తీరుతో బాధగా ఉంది..పార్టీ నిర్ణయమే ఫైనల్: నాయిని
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

కేసీఆర్ తీరుతో బాధగా ఉంది..పార్టీ నిర్ణయమే ఫైనల్: నాయిని

Minister Nayini Disappointed KCR

టీఆర్ఎస్ సీనియర్ నేత ఆపద్ధర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీరుతో తనకు చాలా ఆవేదనగా ఉందని వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తానెక్కడికి వెళ్లినా తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టికెట్‌పై నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు అడుగుతున్నారు. నాకు చాలా తికమక అవుతుందన్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ముషీరాబాద్ టికెట్‌ను తన అల్లుడికి కేటాయించడంలో కేసీఆర్‌కు ఇబ్బంది ఉంటే తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని వివరించారు.

నియోజకవర్గంలో పని చేసుకోమని శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్‌ సంవత్సరం క్రితమే చెప్పారని తెలిపారు. శ్రీనివా్‌సరెడ్డికి టికెట్‌ గురించి మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు కలిశానన్నారు. తనతో మాట్లాడిన తర్వాతే ముషీరాబాద్‌ టికెట్‌పై నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్‌ చెప్పారని.. తొందరపడొద్దని భరోసా ఇచ్చారని వివరించారు. 2014లో తాను ముషీరాబాద్‌ నుంచి పోటీ చేస్తానంటే ‘వద్దు నర్సన్నా, నిన్ను గతంలో ఓడగొట్టారు. నువ్వు ఈసారి ఎల్బీనగర్‌ నుంచి పోటీ చెయ్యి’ అని కేసీఆర్‌ అన్నారన్నారు.

బాగా డబ్బున్న సుధీర్‌రెడ్డి మీద పోటీ చేయలేనంటే.. ‘నీ తమ్ముడిని నేనున్నా. రూ.10 కోట్లు ఇస్తా. పోటీ చెయ్యి’ అని చెప్పారని నాయిని తెలిపారు. వద్దనడంతో ‘ఎమ్మెల్సీగా చేసి నా కేబినెట్‌లో ఉంచుకుంటానన్నడు. దాని ప్రకారమే కేసీఆర్‌ చేశారు’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నానని.. కలిసినప్పుడు అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఏదేమైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని నాయిని స్పష్టం చేశారు.

Related posts

న్యాయ కోవిదుడు..పాటిబండ్ల మృతి…సీఎం దిగ్బ్రాంతి…

chandra sekkhar

‘నువ్వు మా రాక్‌స్టార్’… అంటున్న కరీనా ఫ్యామిలీ

jithu j

న్యాయం జరిగిందట

admin

Leave a Comment