telugu navyamedia
andhra political

175 సీట్లలో గెలుస్తాం.. మళ్ళీ అధికారం మాదే: లోకేశ్

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.విజయవాడలో భవనీపురం వాటర్ వర్క్స్ దగ్గర ఈరోజు నిర్వహించిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల్లో రైతులకు రుణమాఫీతో పాటు175 నియోజకవర్గాల్లో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద డబ్బులు అందజేశామని చెప్పారు. 
అన్ని నియోజకవర్గాలకు తాగునీరు సాగునీరుతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టమని అన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీనే అధికారంలోకి వస్తుందని అని జోస్యం చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు దండగ అని చెప్పిన ఏకైన వ్యక్తి జగనేనని విమర్శించారు. ఏపీ, తెలంగాణల మధ్య చిచ్చు పెట్టేందుకు ఏపీ ప్రతిపక్ష నేత యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ కు చెందిన పులివెందుల నియోజకవర్గంలో కూడా టీడీపీనే గెలుస్తుందని  ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. సీమకు నీళ్లు ఇచ్చే పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించిన జగన్ ను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

Related posts

జమ్మూ కాశ్మీర్ : .. పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయ్..దుష్ప్రచారాలు నమ్మవద్దు.. చేయొద్దు..

vimala p

తిరుపతి : … చైనా సంస్థ టీసీఎల్ …నిర్మాణ పనులు భూమిపూజ చేసిన రోజా ..

vimala p

కాకినాడ వైసీపీ.. టీడీపీ లోకి.. !!

vimala p