telugu navyamedia
andhra news political

అభివృద్ధిని అడ్డుకోవడమే వైఎస్సార్‌సీపీ పని: లోకేశ్

ఏపీ మంత్రి నారా లోకేశ్ మరో సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పై మండిపడ్డారు. నవ్యాంధ్రలో అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. విభజన హామీలపై కేంద్రం చేస్తున్న అన్యాయంపై కలిసి పోరాడాల్సిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏ ఎజెండాతో టీఆర్‌ఎస్ తో కలిసి నడుస్తున్నారని ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రజలను కేసీఆర్‌ రాక్షసులు అన్న విషయాన్ని మరచిపోయారా అని వైసీపీని ప్రశ్నించారు. తెలంగాణాలో 35 ఉపకులాలను బీసీల జాబితా నుంచి తొలగించినందుకా? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్న కూటమిలో టీఆర్‌ఎస్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప మరే పార్టీలూ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీ సర్కారు అవినీతికి పాల్పడుతోందని పదేపదే చెబుతున్న బీజేపీ నేతలు, వారి వద్ద ఏమైనా ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

Related posts

బీజేపీకి సీట్లు తక్కువ వస్తే.. ప్రధాని మార్పు : సంజయ్ రౌత్

vimala p

పవన్ పై పోటీకీ నేను సిద్దం: కేఏ పాల్

vimala p

తెలంగాణ భూ రికార్డులతో “ధరణి వెబ్‌సైట్”

ashok