telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లో రైతుబజార్‌ వద్ద నిర్మించిన 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, ప్రారంభించారు. రెండు ఎక‌రాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంత‌స్తుల్లో ఈ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ఘనత సీఎం కేసీఆర్‌దేనని… పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి భవనాలు పేదలకు నిర్మించి ఇవ్వలేదన్నారు. వనస్థలిపురంలో ఇదే ఇల్లు కొనుగోలు చేయాలంటే రూ. 40-50 లక్షలు అవుతందని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇంకా చాలా పథకాలు తీసుకువస్తుందన్నారు.  ఈ కార్యక్ర‌మంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌ల్లేశం, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

Related posts