telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణకు దీపావళి కానుక అందించిన కేటీఆర్…

KTR

మంత్రి కేటీఆర్ ghmc ప్రజలకు వరాల వర్షం కురిపించారు. నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను ఇవాళ మీడియాకు చెప్పారు. 2020 లో కరోన వల్ల ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయిందని.. ప్రజలకు,ప్రభుత్వం పై ప్రభావం పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టామని… కరోన నియంత్రణ లో తెలంగాణ బాగా పనిచేస్తోంది అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారన్నారు. దీపావళి కానుకగా 2020..21 సంవత్సరం కి హైదరాబాద్ తో సహా అన్ని పట్టణాల్లో ప్రాపర్టీ టాక్స్ లో ఊరట లభించనుందని… 15 వేల లోపు ఇంటి పన్ను కట్టే  యాజమనులకు 50 శాతం మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. 13 లక్షల 72 వేల కుటుంబాలున్నాయని.. మినహాయింపులతో 196 కోట్ల 48 లక్షల భారం పడనుందన్నారు. ఇతర మునిసిపాలిటీ లలో 10 వేల లోపు ఇంటి పన్ను కట్టే వారికి 50 శాతం మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. దీంతో 17లక్షల 67 వేల కుటుంబాలకు  ప్రభుత్వం పై130 కోట్ల భారం పడనుందన్నారు. మొత్తం 31లక్షల40 వేల కుటుంబాలకు లబ్ది జరగనుందని.. అటు 326 కోట్ల 48 లక్షల భారం ప్రభుత్వం పై పడనుందన్నారు. కట్టి ఉంటే వచ్చే ఏడాది అడజస్ట్ చేస్తామని.. గ్రేటర్ తో పాటు చుట్టూ ఉన్న మున్సిపాలిటీ లలో వరద సహాయం అందించామని తెలిపారు. 4కోట్ల75 లక్షల 871 కుటుంబాలకు 10 వేల చొప్పున..  475 కోట్లు అందించామన్నారు. ఇంకా రిలీఫ్ అందని వారికి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్ ఇస్తే బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. హెల్త్, శానిటేషన్ వర్కర్స్ కరోన సమయంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. దీపావళి కానుకగా ghmc శానిటేషన్ వర్కర్స్ కి జీతం 3 వేల రూపాయలు పెంచుతున్నామని తెలిపారు.

Related posts