telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వరద బాధితులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసిన కేటీఆర్

హైదరాబాద్ లో ముంపు ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురికి అందించారు. ఖైరతాబాద్ లోని ఎమ్మెస్ మక్త మరియు రాజు నగర్ లో ముంపు ప్రభావానికి గురైన పలు కుటుంబాలను కలిసి.. వారితో మాట్లాడి, తక్షణ సాయంగా ప్రభుత్వం తరపున పదివేల రూపాయల నగదును మంత్రులు అందించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ విజయ రెడ్డి లు మంత్రుల వెంట ఉన్నారు. కాగా వరదనీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని నిన్న సీఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సీఎం చెప్పారు.

Related posts