telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉమ్మడి జలాల్లో కరోనా కట్టడి చర్యలు భేష్: మంత్రి జగదీష్ రెడ్డి

jagadish reddy

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా కట్టడి చర్యలు భేష్ అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, బత్తాయి ఎగుమతులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను తప్పక పాటించాలన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు వచ్చాయని జగదీష్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. గన్ని బ్యాగ్స్, ట్రాన్స్ పోర్ట్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని. రైతును రాజును చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

Related posts