telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాళ్ల తిట్లకు భయపడను.. దీవెనలుగా తీసుకుంటా.. ఇంకా బలపడతా..!

దుబ్బాక నియోజకవర్గం, తొగుట మండలం ఘనపూర్, గుడికందుల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాక ముందు రైతుల పరిస్థితి అత్యంత దుర్భరమని.. కాంగ్రెస్, తెలుగుదేశంల పాలనలో రైతుల ఆత్మహత్యలే మిగిలాయని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారిందా లేదా? అని.. నాటి నైజం పాలన నుండి నిన్నటి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరు భూమి ఉన్న వారి వద్ద శిస్తు వసూలు చేశారని పేర్కొన్నారు. ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి వారికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చారని..రైతుల బతుకుల్లో మార్పు రావాలని సీఎం కేసీఆర్, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తున్నారని వెల్లడించారు. వాళ్లు పైసలో.. సీసాలో ఇస్తారు.. లేదంటే హరీశ్ రావు ను తిడుతరని.. బీజేపీ ఫారిన్ మక్కలు తెచ్చి తెలంగాణ కోళ్లకు పోస్తే.. మన మక్కలు ఎవడు బుక్కాలి ? అని ప్రశ్నించారు.

బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నదని..మార్కెట్లను ప్రయివేటు పరం చేసి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. వాళ్ల తిట్లకు భయపడను.. దీవెనలుగా తీసుకుంటా.. ఇంకా బలపడతానని.. బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిస్తున్న 5 రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్, ఎకరాకు 10 వేలు ఇస్తున్నారా చెప్పి వాళ్ళు ఓట్లు అడగాలన్నారు. వచ్చే మూడేళ్లు అధికారంలో ఉండేది మేమని.. అభివృద్ధి మాతోటి కాక వాళ్ళతోటి అయితదా అని అన్నారు. కాంగ్రెస్ చేతిలో నెత్తి లేదు.. కత్తి లేదు.. వాళ్లెం చేస్తరని…బీజేపీ గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదని ఫైర్ అయ్యారు. వాళ్లు పైసలో.. సీసాలో ఇస్తారు.. లేదంటే హరీశ్ రావు ను తిడుతారని.. బీజేపీ ఫారిన్ మక్కలు తెచ్చి తెలంగాణ కోళ్లకు పోస్తే.. మన మక్కలు ఎవడు బుక్కాలి ? అని ప్రశ్నించారు. బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నదని…మార్కెట్లను ప్రయివేటు పరం చేసి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. రాదనుకున్న తెలంగాణ ను, కాదనుకున్న కాళేశ్వరం నీళ్లను తెచ్చిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. వాళ్ల తిట్లకు భయపడను.. దీవెనలుగా తీసుకుంటా.. ఇంకా బలపడతానని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Related posts