telugu navyamedia
news political Telangana

తన కారునూ తనిఖీ చేయాలన్న మంత్రి ఎర్రబెల్లి

Minister Erraballi comments Congress

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తొర్రూరు ప్రాంతంలో ప్రత్యేక పికెట్ ను ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో కొడకండ్ల వైపు వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన కారులో అదే మార్గంలో వచ్చారు.

కారును ఆపిన తరువాత మంత్రిని గుర్తించిన పోలీసులు, తనిఖీ చేసేందుకు తటపటాయించారు. ఈ క్రమంలో తన కారును తనిఖీ చేయాలని ఎర్రబెల్లి సూచించారు. అప్పుడు మంత్రి కారును పోలీసులు తనిఖీ చేశారు. పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు తాను సహకరిస్తానని, నిబంధనల ప్రకారం కారును చెక్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. తనిఖీల అనంతరం ఎర్రబెల్లి కారు ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.

Related posts

ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ వెళ్లాలా?: చంద్రబాబు ఫైర్

vimala p

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విజయ్‌ చందర్‌

vimala p

మీడియా స్వేచ్ఛపై లోక్ సభలో ప్రస్తావించిన గల్లా జయదేవ్

vimala p