telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వర్ధన్నపేట తన కన్నతల్లి వంటిది: మంత్రి ఎర్రబెల్లి

yerrabelli dayakar on ravali case

వర్ధన్నపేట తన కన్నతల్లి వంటిదని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్‌లో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుద్యోగులు తమకు ఉద్యోగం రాలేదని బాధ పడకుండా పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సుమారు 40 కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. జీతం తక్కువ అని చూడకుండా వచ్చిన ఉద్యోగాన్ని చేస్తూ స్కిల్స్ పెంచుకోవాలని ఉద్యోగార్థులకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రూ.25 కేటాయించిన తరువాత కూడా తండాల అభివృద్ధి కోసం వెంటనే మరో రూ.10 కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

Related posts