telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కమిషన్ ఇవ్వాలని సిమెంట్ కంపెనీలపై వైసీపీ ఒత్తిడి: దేవినేని

devineni on power supply

ఏపీ సర్కార్ పై మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. గోవుల మృతిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ లో వారు మీడియాతో మాట్లాడుతూ ఇసుక కొరతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు.

బస్తాకు ఐదు రూపాయల కమిషన్ ఇవ్వాలని వైసీపీ నేతలు సిమెంట్ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. అందుకే ఇసుక కొరతను సృష్టించారని అన్నారు. సజ్జల, గంగిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి.. సిమెంట్ కంపెనీలతో ఏం మాట్లాడారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అధెవిధంగా అన్నా క్యాంటీన్ల మూసివేతపై మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసివేయడం దారుణమని అన్నారు.

Related posts