telugu navyamedia
news study news Telangana trending

హైదరాబాద్ : … మినీ జాబ్ మేళ.. ప్రైవేట్ కొలువులు..

job mela for pharma certified

ఈ నెల 10న నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌బ్యూరో, మోడ్‌ కేరియర్‌ సెంటర్‌ డిప్యూటీ చీఫ్‌ అధికారి ఎన్‌.అనంతరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ, కాలిట్‌ హెచ్‌ఆర్‌, బయో కేర్‌ మెడికల్‌ సిస్టమ్స్‌, హిందూజా గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వేగారియాస్‌ సొల్యూషన్స్‌, ఐడీబీఐ ఫెడరల్‌ ఎల్‌ఐసీ లిమిటెడ్‌, సన్‌ప్లవర్‌ సేల్స్‌ డిస్ట్రిబ్యూషన్స్‌, పేటీఎం తదితర ప్రైవేట్‌ కంపెనీలలో కలిపి దాదాపు 1000 ఉద్యోగాల ఎంపికకు ఈ మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

పదవ తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, పీజీ, ఎంబీఏ, బీ ఫార్మసీ, డి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు ఎంపిక అయిన వారికి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జీతభత్యాలు ఇవ్వబడుతుందన్నారు. అభ్యర్థుల వయసు 19-35ఏండ్ల పురుషులు, స్త్రీలు అర్హులని, పూర్తి వివరాలకు యంగ్‌ ప్రొఫెషనల్‌ టి.రఘుపతి 8247656356, 88868 84049నంబర్లలో సంప్రదించాలన్నారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు పూర్తి బయోడేటాతో లోయల్‌ ట్యాంక్‌బండ్‌ ఏఆర్‌కే ట్రైనింగ్‌ సొల్యూషన్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.

Related posts

పోలవరంను ఐదేళ్ళు ఏటీఎంలాగా వాడుకున్నారు.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి: విజయసాయిరెడ్డి

vimala p

పోలవరంపై .. కేంద్రం రెండు నాళికల ధోరణి..

vimala p

2019 ప్రపంచ కప్ : .. ఉత్సహంగా క్రికెట్ అభిమానులు.. 213 లక్ష్యంతో ఆతిధ్య జట్టు ..

vimala p