telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఆత్మాహుతి దాడులను ఇస్లాం క్షమించదు: అసదుద్దీన్ ఒవైసీ

MIM Comments MP Elections
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జారిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హైదరాబాద్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.పుల్వామాలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. బాంబులు, ఆత్మాహుతి దాడులను ఇస్లాం క్షమించదని తెలిపారు. 
ఇస్లాం పేరుతో జైషే మొహమ్మద్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) చేస్తున్న అరాచకాలకు భారతీయ ముస్లింలు అందరూ వ్యతిరేకమని తేల్చిచెప్పారు.టీఆర్ఎస్ పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు తమను చాలామంది విమర్శించారని  ఒవైసీ తెలిపారు. టీఆర్ఎస్ తొందర్లోనే బీజేపీతో కలిసిపోతుందని వీరంతా చెప్పారన్నారు. కానీ వారు చెప్పినట్టు ఏమీ జరగలేదని గుర్తుచేశారు. ఓ ముస్లిం పార్టీగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తమకు బాగా తెలుసని పేర్కొన్నారు.

Related posts