telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ రెండు పార్టీల ఉచ్చులో పడకండి.. ఆర్టీసీ కార్మికులకు ఓవైసీ హితవు

asaduddin owisi

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై మజ్లీస్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సమ్మె సమయంలో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరమన్నారు.

తొందరపడి ప్రాణాలు తీసుకోకండని తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలను ఆలకించాలని కోరుతున్నాను. సీఎంతో కూర్చుని చర్చించండి. కాంగ్రెస్, బీజేపీ నేతల ఉచ్చుల పడకండి. ఆ రెండు పార్టీలకు సొంత ప్రయోజనాలు ఉన్నాయి. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసినా.. నంబర్ ప్లేట్‌లోని ‘జెడ్’ అనే అక్షరాన్ని మాత్రం తీసేయొద్దని కేసీఆర్‌ కు అసద్ ఓ విజ్ఞప్తి చేశారు. అది చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా జ్ఞాపకార్థం పెట్టారని తెలిపారు.

Related posts