telugu navyamedia
health news trending

పాలతో.. ఈ పొడులు.. బరువు పెరగటానికి ప్రధాన కారణాలు..

milk with powders is not healty

పాలు పిల్లల ఎదుగుదలలో ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి అని రోజు వివిధ పాలపొడులను ఉత్పత్తి చేసి అమ్ముకునే వారు కోట్లతో ప్రకటనలు ఇస్తున్నారు. అది చూసి తమ పిల్లల కోసం అందరూ రకరకాల పొడులను పాలల్లో కలిపి తాగిస్తున్నారు. దీనితో అధిక బరువు పెరిగి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అలాంటి పాలు తాగితే పాలలోని ప్రయోజనాలు పక్కనపెడితే, బరువు పెరగటం అనే ప్రధాన సమస్య తలెత్తుతుందని వైద్యులు అంటున్నారు. దానితో వారు పాలు తాగించకపోయిన పరవాలేదు అంటున్నారు. ఉట్టి పాలు తాగించడం శ్రేష్టం.. లేదా ఆ పాలతో లభించే పోషకాలు ఇతర ఆహారపదార్దాలలో లభిస్తాయి. వాటిని పిల్లలకు ఇవ్వాలి.

పిల్లలకు తప్పనిసరిగా పాలు తాగించాలా? పాలలో దొరికే పోషకాలు ఇతర ఆహార పదార్థాలలో దొరుకుతాయా? అన్న సందేహం ఉంటుంది. దానికి ఒక ట్రైనర్ చెప్పిన జవాబు చూద్దాం. పిల్లలకు పాలు అవసరం లేదంటున్నారు రుజుత దివేకర్. ఈమె ఫిట్‌నెస్ ట్రైనర్. కరీనా కపూర్, అలియా భట్‌లాంటి సెలెబ్రిటీలకు రుజుత ఫిట్‌నెస్ ట్రైనర్. ఆమె నోట్స్ ఫర్ హెల్దీ కిడ్స్ అనే పుస్తకం రాశారు. ఇందులో పిల్లలకు పాలు తప్పనిసరి కాదని చెప్పారు. కెనడాలో దాదాపు ఇలాంటి ఆదేశాలే ఉన్నాయి. కెనడా ఫుడ్‌గైడ్‌లో పాలు తప్పనిసరి అని చెప్పలేదు. ఆయా కాలాల్లో దొరికే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

కొందరు పాలలో చాక్లెట్ ఫ్లేవర్ కలిపి ఇస్తుంటారు. అలా చేస్తే పాలు తాగి ప్రయోజనం లేదు అంటున్నారు రుజుత. దానితో పాటు లావైపోతారని కెనడా నిపుణులు అంటున్నారు. పౌడర్ కలుపడం వల్ల పాల ప్రయోజనాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. నువ్వుల చిక్కీలు, శనగపిండి లడ్డు, రాగి పాయసం, దోశతో కూడా కాల్షియాన్ని భర్తీ చేయవచ్చని రుజుత అంటున్నారు. బాదం, సోయా, రైస్‌మిల్క్ లాంటి నాన్‌డెయిరీ మిల్క్ కొనేటప్పుడు వాటిమీద లేబుల్ తప్పకుండా చూడండి. అందులో విటమిన్‌లు, ఖనిజాలు ఉన్నాయో లేదో పరిశీలించండి. ఫార్టిఫైడ్ పాలయితే పిల్లలకు మంచిదే. పాలకు బదులుగా బలవర్దకమైన ఆహారం తినిపిస్తే పాలతో పనిలేదంటున్నారు రుజుత.

Related posts

ఫీజు వేధింపులు భరించలేక ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

vimala p

ఆర్బీఐ హెచ్చరిక : ఈ యాప్ మీకు ప్రమాదకరం

vimala p

యూత్ క్లబ్ లకు .. తెరలేపుతున్న తెలంగాణ ప్రభుత్వం.. దరఖాస్తులు ఆహ్వానం..

vimala p