telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మోడీ సర్కార్ దెబ్బ : సెంచరీ కొట్టేసిన లీటర్‌ పాల ధర !

మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా ఇవాళ డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రాజస్థాన్‌ రాష్ట్రంలో ఇప్పటికే రూ.100లకు చేరాయి చమురు ధరలు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా హర్యానాలోని హిసార్‌ రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లీటర్‌ పాల ధర రూ. 100కు పెంచుతున్నట్లు హిసార్‌ ఖాప్‌ పంచాయత్‌ పేర్కొంది. ప్రభుత్వ సహకార సంఘాలకు రూ. 100 కే విక్రయించాలని రైతులను కోరింది. సాధారణ ప్రజలకు మాత్రం లీటర్‌ పాలు రూ. 55 నుంచి 60కు అమ్మాలని తెలిపింది. కేంద్రాన్ని నిద్రలేపేందుకు, ఈ చర్యలు తీసుకున్నామని హిసార్‌ ఖాప్‌ పంచాయత్‌ స్పష్టం చేసింది. అంతేకాదు సాగు చట్టాలను రద్దు చేయాలని, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేసింది హిసార్‌ ఖాప్‌ పంచాయత్‌.

Related posts