telugu navyamedia
సినిమా వార్తలు

తప్పు చేశాను… దేశానికి క్షమాపణలు చెబుతున్నా.. : మికా సింగ్

Mika-Singh

కశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాక్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మ‌న సినిమాల‌తో పాటు క‌ళాకారుల‌ని నిషేదించింది. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖ గాయ‌కుడు మికా సింగ్ పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు చెందిన సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి త‌న టీంతో వెళ్ళాడు. కార్య‌క్ర‌మం పూర్తైన త‌ర్వాత ఇండియాకి తిరిగి వ‌స్తున్న మికా భార‌త్ బోర్డ‌ర్ ద‌గ్గ‌ర భార‌త్ మాతాకీ జై అనే నినాదాలు కూడా చేశాడు. భార‌త్ – పాక్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న స‌మ‌యంలో మికా సింగ్ పాక్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డంపై భారతీయులు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) అతనిపై నిషేధం విధించింది. దేశంలో పాటలు పాడడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సినిమాల్లో నటించడం పైనా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఎఫ్‌డబ్ల్యూఐసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో మికా క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఓ వీడియో విడుద‌ల చేశాడు. “నేను తప్పు చేశాను. అందుకు ఈ దేశానికి క్షమాపణలు చెబుతున్నా. నా వాదన వినకుండా తనపై నిషేధం విధించంకండి” అంటూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి విన‌తి పంపించిన‌ట్టు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ తెలిపారు. ఇక ఎఫ్‌డబ్ల్యూఐసీఈ కూడా మికా సింగ్ వాదన వినాలనుకుంటున్నట్టుగా, ఆ తరువాతనే అతనిపై విధించిన నిషేధం గురించి అలోచించి నిర్ణయం తీసుకుంటామని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts