telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఇండియా మార్కెట్లోకి .. ఎంజీ మోటార్స్ ఇంటర్నెట్ కార్ ‘హెక్టార్‌’ ..

mg motors internet car Hector in India

ఇండియా మార్కెట్లోకి బ్రిటన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఎట్టకేలకు అడుగుపెట్టింది. వచ్చే జూన్‌లో తన తొలి ఇంటర్నెట్ కారైన ‘హెక్టార్‌‘ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఐస్మార్ట్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించడానికి అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్, సాప్‌లతో ఈ కంపెనీ జతకట్టింది. దేశీయ మార్కెట్లో లభించనున్న తొలి ఇంటర్నెట్ కారు ఇదేనని కంపెనీ వర్గాలు స్పష్టంచేశాయి. గతంలో ఏ భారతీయ కారులో చూడని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ఐస్మార్ట్ నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు డోర్లు మాటలతో తెరుచుకోనున్నది. సిమ్ కార్డు ద్వారా ఈ కారును అనుసంధానం చేయడం ద్వారా నూతన టెక్నాలజీ సేవలు అందించడానికి వీలుంటుంది. కారు ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

* ఈ కారులో బటన్‌ ఫ్రీ వాయిస్‌ అసిస్టెంట్‌ ఉంటుంది. ‘హలో ఎంజీ‘ అంటూ కారు రూప్‌, తలుపులు తెరవమని డ్రైవర్ ఆదేశించవచ్చు. ఏసీని పెంచడం, తగ్గించడం, నావిగేషన్‌ సహా ఎన్నో సౌకర్యాలను కేవలం నోటిమాటతోనే పొందవచ్చు.

* అతితక్కువ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లోనూ ఇది చక్కగా పనిచేస్తుంది. ఓనర్ తన స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో కారుతో కనెక్ట్ కావొచ్చు. కారులో లేకున్నా కూడా సన్ రూఫ్ ఓపెన్ చేయడం, డోర్ లాక్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ కారులో ఇన్‌బిల్ట్‌గా 5జీ స్మార్ట్‌ సిమ్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్‌తో దీనికి అనుసంధానం కావచ్చు. అంతేకాదు, పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ అప్లికేషన్లను ‘గానా.కామ్‌‘ను కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా ప్రయాణ సమయాల్లో నచ్చిన మ్యూజిక్ వినవచ్చు.

* ఎంజీ హెక్టర్‌లో అతిముఖ్యమైన ఫీచర్ ఐస్మార్ట్ వ్యవస్థ. దీని ద్వారా మొత్తం కారునే కంట్రోల్ చేయవచ్చు. ఇది 10.4 అంగుళాల ట్యాబెట్ రూపంలో ఎం2ఎం సిమ్ కార్డును కలిగి ఉంటుంది. 4జీ నెట్‌వర్క్‌తో అనుసంధానమౌతుంది. అంతేకాదు భవిష్యత్‌లో 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఎమర్జెన్సీ కాల్స్, వెహికల్ స్టేటస్, సన్‌రూఫ్ క్లోజ్, డోర్ లాక్ ఇలా చాలా పనులు చేసేస్తుంది.

* ఎమర్జెన్సీ కాల్ ఫీచర్ ఒకటి ఉంటుంది. కేవలం స్మార్ట్‌ఫీచర్లకే కాకుండా భద్రతకు కూడా పెద్ద పీట వేసినట్లు ఎంజీ మోటర్‌ తెలిపింది. రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఇందులో ఉన్న ఇ-కాల్‌ ఎమెర్జెన్సీ వ్యవస్థ ద్వారా కస్టమర్‌ కేర్‌కు తెలిసేలా ఏర్పాటు చేశారు. ఇది 24/7 పల్స్ హబ్‌కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఉదాహరణకు కారు ప్రమాదానికి గురైతే.. ఇ-కాల్ యాక్టివేట్ అవుతుంది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోగా, సంస్థ పల్స్‌హబ్‌కు టెక్ట్స్‌ మెస్సేజ్‌ వెళ్లిపోతుంది. పల్స్ హబ్‌కు కార్ లొకేషన్‌తో కూడిన టెక్ట్స్ మెసేజ్ వెళ్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఎమర్జెన్సీ నెంబర్‌కు కూడా మేసేజ్ పోతుంది. దీనితో పల్స్ హబ్ తక్షణ సహాయక చర్యలు తీసుకుంటుంది.

mg motors internet car Hector in Indiasప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా హారియర్‌, జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 500లకు దీన్ని పోటీగా భావిస్తున్నారు. కంపెనీ హెక్టార్‌ను మే చివరినాటికి దేశీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండేండ్లలో నాలుగు నూతన కార్లతోపాటు హైబ్రిడ్, విద్యుత్‌తో నడిచే వాహనాన్ని సైతం విడుదల చేయబోతున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా తెలిపారు. ఈ కారును రూపొందించేందుకు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్, సాఫ్‌లతో ఎంజీ మోటార్ జత కట్టింది.

Related posts