telugu navyamedia
telugu cinema news trending

కావాలనే రేప్ చేయించుకుంటున్నారనేనా ?… సింగర్ ఫైర్

Shwetha

ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్‌పై సింగర్స్ సోనా మొహాపాత్ర, నేహా భాసిన్, శ్వేతా పండిట్ సోషల్ మీడియా వేదికగా మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కానీ మొదటిసారి ఓ గాయని అను మాలిక్ కామాంధుడు కాదు దేవుడ అంటూ మీడియా ముందుకు వచ్చారు. అను మాలిక్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇంతకీ అను మాలిక్‌కు సపోర్ట్ చేస్తూ హేమా సర్దేశాయ్ ఏమన్నారంటే.. ‘ఎందరో పేరున్న సింగర్స్‌కు కెరీర్ తొలినాళ్లలో మంచి పాటలు పాడే అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్. ఆ సింగర్స్‌లో నేనూ ఒకదాన్ని. నా పేరు హేమా సర్దేశాయ్. చాలా ఏళ్ల క్రితం నేను ఇండస్ట్రీలో ఎన్నో బాధలు పడ్డాను. నా కెరీర్ కోసం మరొకరితో పడుకునేంత స్థాయికి దిగజారే మనిషిని కాను అని మీడియా ముందుకు వచ్చి చెప్పాను. ఆ సమయంలో ఎవ్వరూ నా తరఫున ఎందుకు మాట్లాడలేదు. అను మాలిక్ నిజంగానే లైంగికంగా వేధించి ఉంటే ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకు ఉన్నారు? అను మాలిక్ పుణ్యమా అని ఆయన కంపోజ్ చేసిన ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను పాడే అవకాశం నాకు వచ్చింది. నాలాగా టాలెంట్ ఉన్న సింగర్ అను మాలిక్ కంపోజ్ చేసిన పాటల్ని పాడారంటే.. ఆయన టాలెంట్‌ను మాత్రమే చూసే మంచి మనసున్న మనిషని అర్థం అవుతోంది. ఆయనపై ఆరోపణలు చేస్తున్న కొందరు సింగర్స్‌ను నేను ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. ‘ఇన్నాళ్లూ మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు? మీరు పనిచేసిన ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా దేవుళ్లేనని మీరు అంటున్నారా? పబ్లిసిటీ కోసం మీరు అను మాలిక్‌పై రాళ్లు విసురుతున్నారా? ఇది సరైన పద్ధతి కాదు. అను మాలిక్ కంపోజ్ చేసిన పాటలు పాడిన వారంతా ఆయనపై ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. నాలాంటి డీసెంట్ సింగర్ ఇలా మాట్లాడుతోందంటే ఓసారి ఇది సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయమే. ఇది పబ్లిసిటీ కోసం నేను చేస్తున్న పోస్ట్ కాదు. నిజానికి మద్దతు తెలిపితే ఉండే సంతృప్తి ఏంటో తెలుసుకోండి’ అంటూ పోస్ట్ చేశారు.

దీనిపై శ్వేతా పండిట్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “ఇది సిగ్గుచేటు కంటే ఘోరమైనది. ఆమె మాటలకు అర్థం ఏంటి? మాలాంటి వాళ్లు కావాలనే రేప్ చేయించుకుంటున్నారనేగా? అసలే ఆమె ఏమనుకుంటోంది? ఏం మాట్లాడుతోంది? ఇది దరిద్రంగా ఉంది. పైగా ఓ మహిళ అయివుండి మరో మహిళకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

విమానాన్ని దొంగిలించిన 13 ఏళ్ళ అబ్బాయి… ఎలాగంటే…!?

vimala p

సినిమా ఇండస్ట్రీపై సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

vimala p

అర్జున్ సురవరం : ఆకట్టుకుంటున్న “బ్యాంగ్ బ్యాంగ్…” లిరికల్

vimala p