telugu navyamedia
వ్యాపార వార్తలు సాంకేతిక

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కుప్పకూలింది..

చరిత్రలోనే తొలిసారి ఫేస్‌బుక్ కంపెనీ మెటా షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఒక్కరోజులోనే 26 శాతం మేర మెటా షేర్లు పతనమయ్యాయి. మెటా ఫలితాలు అంచనాలకు మించి పడిపోవడం, మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరగడం ఫేస్‌బుక్‌ను దెబ్బకొట్టాయి.

2012లో వాల్‌స్ట్రీట్‌లో ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత వరస్ట్ నష్టాలను గురువారమే ఎదుర్కొంది.
ఒక అమెరికా పబ్లిక్ కంపెనీ మార్కెట్ వాల్యు ఈ మేర పడిపోవడం ఇదే తొలిసారి.

ఈ పతనంతో కంపెనీ వాల్యు ఒక్కరోజులోనే 200 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మెటా షేర్లు కుప్పకూలడం ఇండియన్ బిలీనియర్స్‌కి కలిసి వచ్చింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీనియర్ జాబితా ప్రకారం, అదానీ నికర విలువ 90.1 బిలియన్ డాలర్లు ఉండగా.. అంబానీ నికర సంపద 90 బిలియన్ డాలర్లుగా ఉంది. మెటా షేర్ల భారీ పతనంతో జుకర్‌బర్గ్ పన్నెండవ స్థానానికి పడిపోయారు. ఈయన సంపద 85 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

Related posts