telugu navyamedia
సినిమా వార్తలు

కంగనా రనౌత్ “మెంటల్” పోస్టర్

Mental

“మణికర్ణిక” సినిమాకు దర్శకత్వం వహిస్తూనే ప్రధాన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది కంగనా రనౌత్. ఆ తరువాత ఈ సినిమా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు, క్రిష్ పై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం కంగనా నటిస్తున్న తాజా చిత్రం “మెంటల్ హై క్యా” కూడా వివాదాస్పదంగా మారేలా కన్పిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ ఇప్పుడు విడుదలైంది. కంగన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్ కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ హడలెత్తించేలా ఉంది. పోస్టర్‌లో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావ్ వారి నాలికలపై పదునైన బ్లేడ్ కన్పిస్తోంది. ఈ సినిమాకు ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Related posts