vithanalu poetry corner

మస్తిష్క మధనం…

మనసున్నవాడికి,
మనిషి గురించే కాదు,
కంటికి కనిపించే 
సమస్త ప్రకృతినిగురించి 
అలోచించి …
అందులోని అందచందాలను,
సృష్టిరహస్యాలను,
ఆస్వాదించడమే కాదు …
తన మధుర అనుభూతిని,
ఎదుటివాడికి ..
అందంగా చెప్పాలనిపిస్తుంది !
 
ఆలోచనలు అక్షరరూపం దాల్చి,
ఆకర్షణీయమైన  శిల్పం మాదిరిగా 
రూపు దిద్దుకుని,
అంద మయిన కవితగా మారి,
మధుర కవిత్వంగా …
పురుడు పోసుకుంటుంది !
 
మస్తిష్క మధురబాండంలో,
నిక్షిప్తమైవున్న 
అక్షర అమృత గుళికలు,
కవిత్వ సారాన్ని 
పదింతలు చేసి ….
ఒక అద్భుత కావ్యానికి 
పూనాది రాళ్ళై నిలుస్తాయి !
 
కవిత్వం ..
కవి కలంనుండి జాలువారే 
అద్భుత పద చిత్రం,
ఇది ఏ కొద్దిమందికో ప్రాప్తించడం 
సాహితీ విచిత్రం !!
 
-డా.కె .ఎల్ .వి.ప్రసాద్,
    హనంకొండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *