telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

తిండి లేక … కింగ్ కోబ్రాతో కడుపు నింపుకుంటున్న కుటుంబం

kobra

పన్నెండడుగుల కింగ్ కోబ్రాని వేటాడి భుజాలపై వేసుకుని వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఆ వీడియోలో ముగ్గురు వ్యక్తులు భారీ కింగ్ కోబ్రాను భుజాలపై వేసుకుని వస్తూ తమకు ఆహారం దొరికిందని.. కోబ్రాని ముక్కలు చేసి చక్కగా వండుకుని తింటామని చెబుతున్నట్లుగా ఉంది. అందుకోసం అరటి ఆకులను పేర్చి దానిపై కింగ్ కోబ్రాని ఉంచారు. దానిని శుభ్రం చేసి ముక్కలు చేయనున్నట్లు చెప్తున్నట్లున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే దాని వెనక పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక.. ఇంట్లో తిండి సరుకులు లేకపోవడం వల్లే వాళ్లు వేటకి వెళ్లినట్లు సమాచారం. ఆంక్షల కారణంగా ఇంట్లో బియ్యం అయిపోయాయని.. అందుకే అడవిలోకి వేటకి వెళ్లినట్లు ఆ ముగ్గురిలో ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. వేటకి వెళ్లిన సమయంలో భారీ కింగ్ కోబ్రా కనిపించిందని.. ఆహారం కోసం దానిని వేటాడి తీసుకొచ్చినట్లు పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది.

Related posts