telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

రోడ్డుపై దొరికిన మెమొరీ కార్డు… అందులో ఏమున్నాయో చూస్తే గుండె దడే…!

Memory

నెల రోజుల క్రితం అలాస్కాకు చెందిన యువతి ఆంకరేజ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా… ఆమెకు ఓ మెమరీకార్డు దొరికింది. మెమరీకార్డులో ఉన్న దృశ్యాలను చూసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మెమరీకార్డులో.. యువతిని ఓ వ్యక్తి కట్టేసి గొంతు పిసికి చిత్రహింసలు పెట్టిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఇది నిజమేనా లేదా ఎవరైనా కావాలని ఇలా చేశారా అని మొదట అనుమానించారు. వీడియోలో వ్యక్తి నుంచి యువతి తప్పించుకోడానికి అతడి చేతుల మీద గాయం చేయడం తదితర భయానక చిత్రాలు చూసిన పోలీసులు ఇది నిజమేనని గ్రహించి దర్యాప్తు మొదలుపెట్టారు. మెమరీకార్డులో ఉన్న ఫైల్‌కు హోమిసైడ్ ఇన్ డౌన్‌టౌన్ మరియట్ (మరియట్ ప్రాంతంలో నరహత్య) అని సేవ్ చేసి ఉండటంతో ఆ ప్రాంతంలో గాలించారు. వీడియోలో కనిపించిన కార్పెట్ ద్వారా అది మరియట్ ప్రాంతంలోని ఓ హోటల్ అని పోలీసులు తెలుసుకున్నారు. దర్యాప్తు జరుగుతుండగా.. మరియట్‌కు కొద్ది దూరంలో ఓ శవం కనిపించిందంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. వీడియోలో ఉన్న మహిళ శవమే అక్కడ దొరకడంతో… పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. మృతురాలి పేరు కాథలిన్ హెన్రీ (30) అని గుర్తించారు. నిందితుడు బ్రైన్ స్టీవెన్ స్మిత్ (48)గా తెలుసుకుని ఫోన్ సిగ్నల్స్ ద్వారా మంగళవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు.

Related posts