telugu navyamedia
సినిమా వార్తలు

“భ‌ర‌త్ అనే నేను” ఎఫెక్ట్… పెరిగిన ట్రాఫిక్ జరిమానాలు

Mahesh-Babu

“భ‌ర‌త్ అనే నేను” సినిమాలో సీఎం పాత్ర పోషించిన మ‌హేష్ బాబు ట్రాఫిక్ రూల్స్ అతిక్ర‌మించే వారికి భారీగా జ‌రిమానాలు విధించాల‌ని ఆర్డ‌ర్స్ జారీ చేస్తాడు. దీంతో స‌గానికి పైగా కేసులు త‌గ్గుతాయ‌ని మీటింగ్‌లో చ‌ర్చిస్తారు. ఈ విష‌యాన్ని ప్రేర‌ణ‌గా తీసుకొని కేంద్ర ప్ర‌భుత్వం ట్రాఫిక్ జ‌రిమానా రేట్లు పెంచింద‌ని నెటిజ‌న్స్ మీమ్స్‌, ట్రోల్స్ చేస్తున్నారు. బిచ్చ‌గాడు చిత్రంలో నోట్ల ర‌ద్దుకి సంబంధించి కొన్ని స‌న్నివేశాలు ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత‌నే నోట్ల ర‌ద్దు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి మోటారు వాహనాల చట్టం-2019 అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఒక వ్య‌క్తికి 16 వేలు, మ‌రో వ్య‌క్తికి 23 వేలు జ‌రిమానా విధించిన‌ట్టు వార్త‌ల‌లో వచ్చిన విష‌యం తెలిసిందే. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీతో పాటు ఇతర ఆధారాలు వెంట తెచ్చుకోవాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొత్త జ‌రిమానాలు “భ‌ర‌త్ అనే నేను” సినిమా ప్రేర‌ణ‌తో అమ‌లు చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ విప‌రీతంగా వ‌స్తున్నాయి.

Related posts