telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా వల్ల ఏపీకి లాభమే అయ్యింది : మంత్రి మేకపాటి

Mekapati ycp

ఆంధ్ర ప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో ప్రత్యేక ఐటీ పాలసీ ప్రకటించే అవకాశం ఉందని.. ఆర్థిక శాఖ క్లియరెన్స్ అవ్వగానే కేబినెట్ లో పెడతామని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఫోకస్ చేశామని.. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఏపీకి లాభమే అయిందని… దీని వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరిగిందని పేర్కొన్నారు. ఫైబర్ నెట్ ద్వారా వచ్చే మూడేళ్ళలో 80 లక్షల ఇళ్ళకు ఇంటర్ నెట్ సదుపాయం కల్పించనున్నామని వెల్లడించారు. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిన్న ఉద్యోగుల నుంచి మొదలు పెడితే…పెద్ద స్థాయి ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అలవాటు అయిన విషయం తెలిసిందే.

Related posts