telugu navyamedia
telugu cinema news trending

ఫిల్మ్ ఛాంబర్ లో మెహ్రీన్ కౌర్ రచ్చ

Mehreen-Kaur

నాని హీరోగా నటించిన “కృష్ణగాడి వీర ప్రేమగాథ” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మెహ్రీన్. అయితే ఇటీవల కాలంలో ఆమెను వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. వరుస ఫ్లాప్ లలో ఉన్న మెహ్రీన్ అడ్వాన్స్ ల గొడవ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ దాకా చేరింది. కొన్నిరోజుల క్రితం సుధీర్ బాబుతో ఓ సినిమా చేయడానికి మెహ్రీన్ అంగీకరించింది. అయితే అనుకోకుండా సుధీర్ బాబు సినిమా నుండి తప్పుకున్నాడు. దీంతో ఆ సినిమా కళ్యాణ్ దేవ్ కు చేరుకుంది. రిజ్వాన్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థపై కళ్యాణ్ దేవ్ హీరోగా ఈ ప్రాజెక్టును తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.

అయితే కళ్యాణ్ పక్కన చేయనని మెహ్రీన్ నిర్మాతలతో చెప్పేసిందట. దీంతో నిర్మాతలు తామిచ్చిన అడ్వాన్సు తిరిగి ఇచ్చేయమని అడిగారట, కానీ మెహ్రీన్ తాను ఈ సినిమా ఒప్పుకున్న కారణంగా రెండు సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని, పైగా డేట్స్ వేస్ట్ అయ్యాయని, అందుకే అడ్వాన్సు తిరిగి ఇవ్వనని చెప్పేసిందట. ఈ గొడవ కాస్త ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్అసోసియేషన్ కి చేరింది. మరి ఫిలిం ఛాంబర్ లో పెద్దల నిర్ణయం ఏంటో తెలియాలి.



Related posts

సెంట్రల్ మాలి లో .. సైనిక స్థావరాలపై ఉగ్రదాడి.. 21 మంది మృతి..

vimala p

పెట్రోల్ కంటే.. విమాన ఇంధన ధర తక్కువ…అందరూ అవే కొనుక్కోవాలా..

vimala p

బంగారం ధరలు..

vimala p