telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ సేతుపతి సరసన.. మేఘా ఆకాష్.. అమలాపాల్ అవుట్..

megha aakash with vijay setupati

మేఘా ఆకాశ్ తెలుగులో తొలి రెండు సినిమాలు భారీ పరాజయాలుగా మిగలడంతో సహజంగానే ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పుడిప్పుడే ఆ పరాజయాల ప్రభావం తొలగిపోతూ అవకాశాలు ఆమెను పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళంలోను నిలదొక్కుకోవడానికి మేఘా ఆకాశ్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

ఆమె ప్రయత్నాలు ఫలించినట్టే ఉన్నాయి. విజయ్ సేతుపతి సరసన ఛాన్స్ లభించిందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి తన 33వ సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. వెంకటకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, ముందుగా అమలా పాల్ ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోవడంతో, మేఘా ఆకాశ్ ను తీసుకున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Related posts