telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి తొలి పారితోషికం ఎంతో తెలుసా..?

ఇండియాలో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో మెగాస్టార్. బాలీవుడ్ హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు. అప్పట్లో ఆపద్భాందవుడు సినిమా కోసం ఈయన కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు. ఆ తర్వాత వరసగా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు చిరు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. తొలి రోజుల్లో డబ్బుల కంటే కూడా ఓ అవకాశం వస్తే బాగున్ను అని చూసేవాళ్లు చిరంజీవి బ్యాచ్. అప్పట్లో చాలా మంది అవకాశాల కోసం చూసేవాళ్లే కానీ పారితోషికం కాదు. ఎంత ఇచ్చినా కూడా తీసుకోవడం అప్పటి నటులకు అలవాటు. అలాగే చిరంజీవి కూడా తను కెమెరా ముందుకు తొలిసారి వచ్చిన సినిమా పునాది రాళ్లు.. అయితే ప్రాణం ఖరీదు ముందు విడుదలైంది. ఈ రెండు సినిమాలకు కూడా చిరంజీవికి ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు. కానీ చిరు నటించిన మూడో చిత్రం మనవూరి పాండవులు సినిమాకు మాత్రం ఈయన అప్పట్లో 1,116 రూపాయాల పారితోషికం అందుకున్నాడు. కృష్ణంరాజు ఈ సినిమాలో హీరో. ఐదుగురు స్నేహితుల బ్యాచ్‌లో చిరంజీవి కూడా ఉంటాడు. ఆ సినిమాకు వెయ్యి నూట పదహార్లు అందుకోగానే చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. తన తొలి సంపాదనను అమ్మానాన్న చేతుల్లో పెట్టి వాళ్ల ఆశ్శీసులు అందుకున్నడు మెగాస్టార్. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1983లో విడుదలైన ఖైదీ సినిమాతో తెలుగు సినిమాకు ఓ కొత్త శకం చూపించాడు చిరంజీవి.

Related posts