telugu navyamedia
సినిమా వార్తలు

చిరంజీవి మనవరాలి అన్నప్రాసన వేడుక… స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ భార్య

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి “సైరా” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మెగా కుటుంబంలో పెద్ద ఫంక్షనే జరిగింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చిన్నకూతురు నవిష్క అన్నప్రాసన కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి దంపతులతో పాటు చిరు పెద్ద కూతురు సుస్మిత, పవన్ కళ్యాణ్ భార్య తన కొడుకుతో సహా హాజరై సందడి చేసారు. ఈ వేడుకలో చిరంజీవి తన మనవరాలికి అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి మెగా హీరోలతో పాటు చరణ్ వైఫ్ ఉపాసన మినహాయిస్తే… మిగిలిన మెగా ఫ్యామిలీకి చెందిన మహిళలు ఈ వేడుకలో సందడి చేసారు. రెండు నెలల క్రితం జూన్ 19న జరిగిన ఈ వేడుక ఫోటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. చిరు ఇంట్లో జరిగిన ఈ అన్న ప్రాసన వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మెగాభిమానులు తెగ వైరల్ అవుతున్నాయి.

Related posts